AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
Monday, 25 February 2013
Thursday, 21 February 2013
Monday, 18 February 2013
Wednesday, 13 February 2013
Monday, 11 February 2013
Friday, 8 February 2013
స్త్రీలలో ఒవ్యులేషన్ - అవగాహన / OVULATION - AWARENESS
ప్రతి స్త్రీ కీ తల్లి కావాలనే కల ఉంటుంది.తల్లి కాలేని ఆడవాళ్ళు అనుభవించే ఇబ్బందిని వర్ణించటం కష్టం.సమాజ పరంగా ,కుటుంబ పరంగా చాలా ఒత్తిడులు ఎదుర్కొంటారు.సాటి స్త్రీలే తిరస్కరిస్తారు.
తల్లి కావాలని ఉన్నా ,అయేందుకు ఏంచేయాలో తెలియని అమ్మాయిలు చాలా మంది ఉన్నారు.కీలకమైన ఆరోగ్యం,ఆనందం గురించి పట్టించుకోక మిగిలిన అర్థం లేని అంశాలగురించి ఆలోచిస్తారు.వారి నెలవారీ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి.రుతుచక్రం సక్రమంగా ఉన్నవారికి సంతానం తప్పకుండా కలుగుతుంది.స్త్రీ తన శరీరంలో ప్రతి నెలా కలిగే మార్పులను అనుభవిస్తుందే కాని అర్థం చేసుకోదు.ప్రతి నెలా హార్మోన్ లు అల్లరి పెడతాయి,చిరాకు,తెలియని ఇబ్బంది,వాటన్నింటినీ తొలగించి ప్రశాంత పరిచే మగతోడు కోసం మనసూ ,శరీరం రెండూ ఎదురుచూస్తాయి.దీనినే వివాహం అన్నారు.ఆ వివాహం తెప్పిచే అంశాలు,అంతర్గతంగా స్త్రీ ప్రత్యుత్పత్తి అంగాలలో జరుగుతుంది.యుక్త వయసులో ఉన్న స్త్రీ శరీరంలో ప్రతి నెలా ఒక అండం విడుదలఔతుంది.ప్రతి అండం మరో జీవికి జన్మనివ్వాలనుకుంటుంది.అందుకే ఆ అండం విడుదల సమయం అమ్మాయిలలో అలజడి కలిగిస్తుంది.పురుషుడితో కలయికకు ప్రోత్సహిస్తుంది.దీనినే వైద్య పరిభాషలో ఒవ్యులేషన్ అంటారు.అంటే స్త్రీ శరీరంలో అండం విడుదలయ్యే సమయం.ప్రతి నెలా ఈ అండం విడుదలయ్యే సమయం స్త్రీకి సంతానం కలిగించే అవకాశం పెంచుతుంది.
బహిష్టుకి ముందు -
తల్లి కావాలని కోరుకునే అమ్మాయి తన అండం విడుదల సమయాన్ని తెలుసుకోవాలి.విడుదలైన అండం పరిమిత కాలం పాటూ పురుయ్షుడి శుక్రకణం కోసం ఎదురుచూస్తుంది.ఆ సమయంలో పురుషుడితో కలవగలిగిన స్త్రీ అద్రుష్టవంతురాలు.తన కడుపులో కొత్త జీవికి ప్రాణం పోస్తుంది.
స్త్రీ ప్రత్యుత్పత్తి అంగం అండాశయం.బాహ్యంగా కనిపించేది యోని ఐతే దాని లోపల ఉంటాయి గర్భాశయం,అండాశయం, అండాశయం నుంచి ఉండే అండనాళం.
ప్రతి నెలా అండాశయం నుంచి ఒక అండం విడుదలఔతుంది.అండాశయంలో అనేక అపరిపక్వ అండాలు ఉన్నప్పటికీ బహిష్టుకి ముందు రోజుల్లో ఒకే ఒక అండం మాత్రం వేగంగా అభివృద్ధి చెంది పరిపక్వ అండంగా మారుతుంది.ఈ అండం మిగతా వాటికంటే వేగంగా పెరిగి పెద్దదౌతుంది.దీనిచుట్టూ ద్రవపదార్థం పోషకపదార్థంగా చేరుతుంది.
హార్మోనుల ప్రభావాన జరిగే ఈ మార్పులతో అండం ఒక అండగుళికగా రూపు దిద్దుకుంటుంది.ఇందుకు 12 నుంచి 14 రోజులు పడుతుంది.పూర్తిగా అభివృద్ధి చెందిన గుళిక బద్ధలై అండం విడుదల చేస్తుంది.ఇది అండనాళికలోనికి ప్రవేశిస్తుంది.
పరిపక్వ అండవిడుదలనే ఒవ్యులేషన్ అంటారు.అండనాళంలో చేరిన అండం శుక్రకణంతో కలిసి పిండంగా మారటానికి సిద్ధంగా ఉంటుంది.
అండవిడుదల సమయం స్త్రీలలో కొన్ని స్పష్టమైన మార్పులు తెస్తుంది.వీటిని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు.గర్భాశయ ముఖద్వారం దగ్గర ద్రవ పదార్థాలు పెరగడం కనిపిస్తుంది.ఇది అంతర్గతంగా జరిగే మార్పు ఐనా దాని ప్రభావం బయటకు కనిపిస్తుంది.తమ బహిష్టుచక్రం మధ్యలో యోనిలో నుంచి ద్రవాలు అతిగా వస్తాయి.ఇది అండం విడుదలను సూచిస్తుంది.
అండం విడుదల సమయంలో -
పొత్తి కడుపు భాగంలో నొప్పి వస్తుంది.బహిష్టుకి ముందు వచ్చే నొప్పి అండం విడుదలకు సంకేతం.అండం విడుదలకు కొంచెం ముందుయ్గా లేదా విడుదల సమయంలో బాధ ఏర్పడుతుంది.ఐతే ఇది అందరిలో కనిపించదు.ఇది కనిపించిందంటే అండం విడుదలైంది అనె సంకేతం అందుకున్నట్లే.
శరీర ఉష్ణోగ్రతలో కూడా మార్పు కనిపిస్తుంది.ఒళ్ళు వేడెక్కడం అనె మాట వినే ఉంటాం.అది పురుషుడితో కలవమని హార్మోనులు రెచ్చగొట్టడం. అండం వృధా కాకుండా
పిండంగా మారాలన్న శారీరక తహతహ అలా చేయిస్తుంది.శ్రీర ఉష్ణోగ్రతలో కొంచెం తేడా చేస్తుంది.శరీరం కింది భాగంలో వేడిగా,పైభాగంలో చల్లగా ఉంటుంది.తర్వాత కింది నుచి పైకి క్రమంగా వేడి వ్యాప్తి చెందుతుంది.అంతా సలుపుతుంది అంటారు.ఇది కూడా అండం విడుదలను సూచించేదే.
ఈ మార్పు కొందరిలో ప్రస్ఫుటంగా ఉంటుంది.కొందరిలో అంత తేడా కనిపించదు.ఇలా అండం విడుదలను8 గుర్తించి ఆ రోజులలో తప్పకుండా సెక్ష్ లో పాల్గొంటే తల్లి అయ్యే అవకాశం బాగా పెరుగుతుంది.అండాశయం నుంచి విడుదలైన పరిపక్వ అండం అండ నాళం లోకి చేరుతుంది.అక్కడ దాదాపు 24 గంటలపాటు పురుషుడి నుంచి వచ్చే శుక్రకణం కోసం వేచి ఉంటుంది.
బహిష్టు తర్వాత -
ఇది సాధారణంగా గత బహిష్టు తర్వాత 14 వ రోజున అయి ఉంటుంది.ఐతే ఇక్కడ కూడా అందరు స్త్రీలలో రుతుచక్రం ఒకేలా ఉండదు.కొందరిలో ఇది 28 రోజుల చక్రంగా ఉంటుంది.ఇది ఉండాల్సిన రీతిలో ఉన్న రుతుచక్రం.ఇటువంటి సక్రమ రుతుచక్రం ఉన్నవారిలో 14 వ రోజున కలయిక గర్భం వచ్చే అవకాశం పెంచుతుంది.కొందరిలో బహిష్టు చక్రం మరీ అంత స్పష్టంగా ఉండదు.అటువంటివారిలో అండం విడుదల తేదీని స్పష్టంగా చెప్పడం కష్టం.
ఎలా జరుగుతున్నా రుతుచక్రమనేది ఒక వయసులో మొదలై మెనోపాజ్ వరకు కొనసాగుతుంది.ప్రతినెలా ఒక అండం విడుదల ఉంటుంది.అప్పుడప్పుడు రుతుచక్రంలో హెచ్చుతగ్గులు ఏర్పడవచ్చు.
కొద్దిగా ముందే బహిష్టు రావడం లేదా ఆలస్యం అవటం వంటివి జరుగుతాయి.కొందరిలో 31 రోజుల రుతుచక్రం ఉంటుంది.వారికి అండం విడుదల 17 వ రోజున జరుగుతుంది.కాబట్టి 14 నుంచి 17 రోజుల మధ్యలో సెక్ష్ లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశం ఎక్కువ.కొంతమందిలో 26 రోజులకు ఒకసారి అండం విడుదల అవుతుంటుంది.అటువంటి వారు గత బహిష్టు తర్వాత 12 వ రోజు కలవటం ద్వారా గర్భం వస్తుంది.క్రమం తప్పక సెక్ష్ లో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గర్భం వస్తుంది.కాని కొంతమంది అంత త్వరగా గర్భం దాల్చరు.అలాంటివారు ఈ రోజులను లెక్కపెట్టుకుని సెక్ష్ లో పాల్గొనటం అవసరమే.
సెక్ష్ లో పాల్గొన్నప్పుడు శారీరకంగా ,మానసికంగా ఆనందం ,తృప్తి కలుగుతుంది.అదే సమయంలో సెక్ష్ తర్వాత స్త్రీ శరీరంలో సంభవించే మార్పుల మీద అవగాహన అవసరం.
ఫలదీకరణం -
సెక్ష్ లో పాల్గొన్నప్పుడు పురుషుడు తన అంగం స్త్రీ యోని లోకి ప్రవేశపెట్టి స్ఖలిస్తాడు.అపుడు వృషణాలలో తయారైన శుక్ర కణాలు పురుషాంగానికి చేరి,ప్రొస్టేట్ గ్రంధి స్రావాలతో కలిసి యోనిలో వదలబడతాయి.ఒకసారి స్ఖలిస్తే పురుషుడు 60 నుంచి 500 మిలియన్ శుక్రకణాలు స్త్రీ యోనిలోకి వదులుతాడు.అటువంటి కణం కోసం అండం ఎదురుచూస్తుంటుంది.అన్నిచోట్లా శుక్రకణాలు యోనిలోకి వదలబడినా చివరికి అండం సమీపానికి చేరేవి కేవలం 200 కన్నా ఎక్కువ ఉండవు.వీటిలో ఏదో ఒక కణమే చివరికి అండాన్ని ఫలదీకరణం చేయగలుగుతుంది.శుక్రకణం కొరడా వంటి తోకను కలిగి ఈదుతుంది.వె ఈతతో వెతుక్కుని వెళ్లి అండాన్ని తాకి అండంతో కలుస్తుంది. ఆండంతో కలిసే ముందు తోకను వదిలేస్తుంది.అండం శుక్రకణం కోసం 24 గంటలు మాత్రమే వేచి ఉండగలదు.కాని శుక్రకణం యోనిలో వదలబడిన తర్వాత 48 గంటల వరకు చైతన్యవంతంగా ఉంటుంది.కలయిక తర్వత ఏర్పడిన సమ్యుక్తబీజం నుంచే కొత్త జీవి ఏర్పడటం మొదలవుతుంది.అందుకు తగిన ఏర్పాటు గర్భాశయంలో ప్రతినెలా చేయబడుతుంది.ఫలదీకరణ చెందిన అండం నెమ్మదిగా గర్భాశయం చేరి గర్భాశయ గోడలోకి చేరుతుంది.ఆ సమ్యుక్త బీజం వచ్చి స్థిరపడేందుకు అవసరమైన సౌకర్యం గర్భాశయంలో జరుగుతుంది. ఈవన్నీ హార్మోన్ ళా ప్రభావాన జరిగే మార్పులే. ఘర్భాశయ గోడలో చేరిన సమ్యుక్త బీజం తల్లి నుంచి ఆహారం తీసుకునేదుకు వీలైన పేగును ఏర్పరచుకుని గోడ నుంచి వెలుపలికి వచ్చి ఎదగటం మొదలుపెడుతుంది.9 నెలలు ఎదగటానికి అవసరమైన ద్రవతిత్తిని గర్భాశయం పిండంలో ఏర్పరచుకుంటుంది.
హార్మోన్ లు సక్రమంగా ఉండాలి.-
ఆండ విడుదలకు ముందు ఒక పుటికలో ఉంటుంది.ఆ పుటిక పగిలి అండం బయటకు వస్తుంది.పుటిక పగిలినపుడు ప్రొజెస్టిరోన్ కూడా విడుదల చేయబడుతుంది.ఇది గర్భంలో పిండం ఎదుగుదలకు సహకరిస్తుంది.
24 గంటలలోపు ఫలదీకరణకు నోచుకోలేకపోయిన అండం దానితోపాటే ఫలదీకరణం జరిగినపుడు దానిని అందుకోవడానికి గర్భాశయంలో జరిగిన ఏర్పాట్లు కలగలిపి బయటకు పంపబడతాయి.యోని ద్వారా అలా అవి బయటకు పంపబడినప్పుడు రక్తం,పలుచని కండరాలు బయటకు పడతాయి.వీటినే బహిష్టు రక్తం అంటారు.ఇలా ఒకసరి బహిష్టు అయిపోగానే తిరిగొచ్చే నెలలో ఫలదీకరణం అవకాశం కోసం స్త్రీ శరీరంలో మార్పులు మొదలౌతాయి.
ప్రతి నెలలో అండం ఆశగా పిండం అవగలనని ఎదురుచూస్తుంది.ఆ ఆశ ఫలించనపుడు విచ్చిన్నమౌతుంది.అండం విడుదల తీరునుంచి పురుషుడి నుంచి శుక్రకణం అందుకునేంతవరకు ఎక్కడ ఏ లోపం ఏర్పడినా ఆమెకు గర్భం రాదు.హార్మోన్ ల లోపంతో అండాలు సక్రమంగా విడుదల కాకపోయినా ,విడుదలయిన అండం గర్భాశయం వైపు ప్రయాణం చేయడానికి వీలులేకుండా అనండనాళాలు మూసుకుపోయినా సమస్యే .ఫలదీకరణం చెందిన అండం గర్భాశయాన్ని చేరి స్థిరపడాలంటే హార్మోన్ ల పాత్ర సక్రమంగా ఉండాలి.అవి సక్రమంగా పని చేసినప్పుడు అండం పిండంగా మారుతుంది.అమ్మాయి అమ్మవుతుంది.
Subscribe to:
Posts (Atom)