Friday, 18 April 2014

ఔషధ దాన సేవ - ధర్మస్థల/VISIT ' DHARMA STHALA ' FOR GOOD HEALTH AND MORE

ఔషధ దాన సేవ చేస్తున్న పుణ్యస్థలం -  ధర్మస్థల

ధర్మస్థల పుణ్యక్షేత్రం లో అన్నదానం  అభయ దానం  ఔషధ దానం విద్యాదానం అంటూ అనేక దాన కార్యక్రమాలకు విశేష ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈ దానాల న్నీ ధర్మ దేవతల ఆనతి మేరకు జరుపబడుతున్నాయి అని భక్తజనుల విశ్వాసం. గత ఆరు వందల సంవత్సరాల నుంచి కుల మత భాష భేదాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు జరుపబడుతున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఒకేసారి 50 వేల మందికి భోజనం చేసేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయబడినాయి. అదే విధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్థానిక ప్రజలను ఆదుకునేలా అభయ దానం నిర్వహించబడుతోంది. రోగ పీడితులు కోసం రూపొందించబడిన సేవా కార్యక్రమమే ఔషధ దాన సేవ. Dharma స్థలంలో స్వామివారిని దర్శించుకునేందుకు కొన్ని ప్రత్యేక నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. పురుషులు పంచె కట్టు, ఉత్తరాయ0 తోనూ స్త్రీలు సంప్రదాయ పద్ధతిలో ఆలయప్రవేశం చేయవలసి ఉంటుంది. రెండేళ్లలోపు చిన్నారులను ఆలయ ప్రాంగణం లోనికి అనుమతించరు. క్షేత్రదర్శనానికి వెళ్ళిన భక్తులు ముందుగా  శ్రీ మంజునాథ స్వామి ని , శ్రీ అమ్మవారిని ,నలుగురు ధర్మ దేవతలను ,గణపతిని అన్నప్ప దేవుడిని దర్శించుకున్న తర్వాత ప్రధాన ఆలయానికి సమీపంలో ఉన్న మహాగణపతిని, అన్నపు స్వామి, ధర్మదేవతలు ఎంపిక చేసిన  ధర్మస్థలన్ని ,చంద్ర స్వామి వారి ఆలయాన్ని, బాహుబలుడు కొలువై ఉన్న  ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇంకా ధర్మస్థల లో మంజూష వాస్తు సంగ్రహాలయం ,పురాతన వస్తువులు అన్నీ చూడవచ్చు . అలనాటి అద్భుతాలను ,చరిత్ర చెప్పే నిజాలను మనం చూడవచ్చు .ఇక్కడకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో నేత్రావతి నది ఉంది. ఈ నదిలో స్నానం సకల పుణ్య కరం ,రోగ రహితంగా స్థలపురాణం చెబుతోంది.. అందుకే ఔషధ  దా న సేవ మొదలుపెట్టారు ఏమో. ఆలయ ప్రాంగణంలోని కి చేరుకోగానే ముఖద్వారం భక్తజనులకు స్వాగతం చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో మంజునాథుడు ఆయన పక్కనే సాలగ్రామ నరసింహ స్వామి దర్శనం ఇస్తుంటారు. మరొక సన్నిధిలో పార్వతీ దేవి, ధర్మ దేవతలు కొలువై ఉన్నారు.
  మంజునాథ స్వామి ఆలయంలో ఇచ్చే ప్రసాదానికి ఒక ప్రత్యేకత కలదు .ఇక్కడ బెల్లంతో చేసిన కజ్జికాయలను ప్రసాదంగా ఇస్తారు .ఈ ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో తీసుకున్న వారికి అనారోగ్య సమస్య ఏదీ ఉండదని ప్రతీతి. భక్తులు తీర్థం స్వీకరించిన తర్వాత చందనాన్ని ఇస్తుంటారు. ఆ ప్రసాదం లభిస్తే చాలు మంజునాథు ని కరుణ లభించినట్లే ఆని భక్తులు భావిస్తారు. 16వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం దేవరాజ హెగ్డే నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి లో శైవ, వైష్ణవ, చైనా సంప్రదాయాలు గమనించగలం. మంజునాథ ఆలయం మట్టితో ,చెక్కలతో మాత్రమే నిర్మించబడింది .ఆ చెక్క స్తంభాలపై అందమైన కళాకృతులు చెక్కబడ్డాయి ,శోభిల్లుతూ ఉంటాయి. వాలు కప్పుతో, కలశాలతో కూడిన ముఖద్వారం ఎంతో అందంగా కనిపిస్తుంది.కర్ణాటక రాష్ట్రంలోని ఈ ధర్మస్థల పుణ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది .మిగతా క్షేత్రాల్లో లేనివిధంగా శివాలయంలో ఓ వైష్ణవ పురోహితుడు , ఓ జైన్ అధికారిని చూడగలం. అన్ని విశ్వాసాలకు ,మతాలకు చెందిన భక్తులు ఈ క్షేత్రానికి దర్శిస్తుంటారు .ముఖ్యంగా ఆరోగ్యం కోసం వచ్చే వారే ఎక్కువ .

ఈ స్థల పురాణం ఈ విధంగా చెబుతోంది .పూర్వం రెండు జంటల దేవతలకు ఒక సందేహం తలెత్తింది. ధర్మం నాలుగు పాదాల నడుస్తున్న ప్రాంతం ఏదైనా ఉందా అంటూ అన్ని లోకాలు వెతుకుతూ చివరికి భూలోకం వచ్చేసరికి మానవ రూపాలతో సంచరించసాగా రు. హెగ్డే ఇంటికి వచ్చే దారిలో ఓ చెరువులో నీరు తాగుతూ ఆవు-పులి కలిసిమెలిసి ఉండడం చూసి తాము ఇంతకాలంగా వెతుకుతున్న ప్రాంతం ఇదేనని దేవతలకు అర్థం అయ్యింది. ఆ రోజు రాత్రి  హెగ్డే కలలో కనిపించి మేము మీ ఇంట్లోనే ఉంటున్నాము , మీ ఇల్లు ఖాళీ చేసి ఇవ్వమని అడిగారు .నీ శేష జీవితాన్ని అనారోగ్యంతో బాధపడేవారికి సాయం చేస్తూ ఈ పుణ్య స్థలి కి వచ్చే వారిని అన్ని విధాలా ఆదుకుం టు  గడపమని ఆదేశించారు. సమయం వస్తే మా సహాయం కూడా అందిస్తామని అన్నారు.ఆ ఇంటిని అందరూ వెలియాడే బీ తు అంటారు.

కాలక్రమంలో ఆ ధర్మదేవత  ల అభ్యర్థన మేరకే ఇంకొక ఆలయం కూడా నిర్మించబడింది . ఆ ధర్మ దేవతా దంపతులు కాలరాహుకావార్కై కుమారస్వామి, కన్యాకుమారి పేర్లతో పిలువబడుతున్నారు .ఆ దేవతల  సన్నిధి పక్కన శివలింగాన్ని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. అదే లింగ రూ పంలోనున్న మంజునాథుడు .ఆ శివలింగాన్ని అన్నప్ప అనే భక్తుడు మంగళూరు పక్కన ఉన్న కద్రి అనే ప్రాంతం నుండి తీసుకు ఓ వైష్ణవ భక్తుని ఆధ్వర్యంలో కుంభాభిషేకం జరిగిందని అప్పట్నుంచి ఈ స్థలాన్ని ధర్మస్థల అని పిలుచుకోవడం జరిగిందని అంటారు. మన అనారోగ్యాన్ని రూపు మాపు కో వ టా ని కైనా ఒక్కసారి దర్శించవలసిన పుణ్యక్షేత్రం  ఈ ధర్మస్థల.