hindi - గేహు
english - wheat
sanskrit - గోధూమా
గోధుమలకు వేడి చేసి ఆర్చగల గుణముంది.ఇతర అన్ని రకాల ధాన్యాల కన్నా బలం కలిగించే శక్తి ఉంది.రక్తాన్ని వృద్ధి చెందించి వీర్యపుష్టిని దేహ కాంతి ని ఆయువును పెంచుతుంది వాత పైత్య ఉబ్బు గాలను పోగొడుతుంది.కండ్లకు చలవ చేస్తుంది .శరీరంలోని చెడు నీరును బయటకు తోసి వేస్తుంది సుఖ విరేచనం కావిస్తుంది.
ముఖ్యంగా ఉబ్బు రోగులకు వాత రోగులకు గాయాలు తగిలిన వారికి ఒళ్ళు కాలిన వారికి మధుమేహ రోగులకు అతిమూత్ర రోగులకు గోధుమలు అనుకూలంగా ఉంటాయి.
* వేడి శరీరం కలవారికి, అజీర్ణ రోగులకు విరేచనాలతో, కడుపుబ్బరంతో, అగ్నిమాంధ్యంతో బాధపడే వారికి గోధుమలు పడవు *
* గోధుమలకు విరుగుడుగా బెల్లం పంచదార పని చేస్తాయి.*
గోధుమ నూకల జావ - గోధుమ నూకలతో కాచిన జావ శీత పైత్య దోషములు పోగొట్టితేలికగా జీర్ణం అవుతుంది. జ్వరంతో బాధపడే వారికి పలుచని గోధుమ నూకల జావ ఇవ్వవచ్చు.

గోధుమ నూక పాయసం - రుచికరంగా ఉండి శరీరంలోని అధిక వాతాన్ని, పైత్యాన్ని అణచివేసి ఒంటికి బలం కలిగిస్తుంది.
నేతి గోధుమ పిండి వంటలు - నెయ్యి కలిపి వండిన గోధుమపిండి వంటలు వాత, పైత్య రోగులకు, గుండె రోగులకు అనుకూలంగా ఉంటాయి. కండ్లకు బలాన్ని కలిగిస్తాయి. బాగా రుచిగా ఉండి శరీరానికి బలాన్ని వీర్య వృద్ధిని కలిగిస్తాయి..
గోధుమ బన్నులు , బిస్కెట్లు - గుణాలు - గోధుమ పిండిని నీటితో నానబెట్టి కొద్దిగా సోడా ఉప్పు వేసి మర్దించి రొట్టెల పొయ్యిలో కాల్చిన రొట్టెలు ,బన్నులు, బిస్కెట్లు రుచిగా ఉండి తేలికగా జీర్ణమై రోగులకు పథ్యంగా ఉంటాయి.
దేహపుష్టి నీ, బలాన్ని, రక్త వృద్ధిని కలిగిస్తాయి
గోధుమ రొట్టెలు.. గుణాలు..
గోధుమ రొట్టెలు వేడి చేసి శరీరాన్ని ఆరుస్తాయి. బాగా ఆకలి పుట్టిస్తాయి. ఎక్కువగా తింటే దాహం పుట్టిస్తాయి. శరీరంలో చెడు నీరు చేరిన ఉబ్బు రోగులకు ఆ నీటిని తీసివేయడంలో ఉపకరిస్తాయి..
పిండిని నానబెట్టకుండా కాల్చిన రొట్టె కడుపులో వాత వాయువు ను బంధించి విరోచనాలను కలుగచేస్తుంది. రాత్రిపూట నానబెట్టి ఉదయం తయారుచేసినచో బాగా అనుకూలంగా ఉంటుంది. నేతి తో మెదిపిన రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది. అయితే ఇందులో కొంచెం జీలకర్ర కానీ పుదీనా కానీ కలిపి వండితే సులభంగా అరుగు తుంది.
అతి మూత్ర రోగులకు - గోధుమ అన్నం -
అతి మూత్ర రోగులకు - గోధుమ అన్నం -
గోధుమలతో వండిన అన్నం మధుమేహ రోగులకు ,అతి మూత్ర రోగులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కఫ రోగులకు మేలు చేస్తుంది.ఐతే ఇది కొంచెం ఆలస్యంగా జీర్ణమవుతుంది. జిలకర వంటి జీర్ణకర పదార్థాలు కలిపి వండుకోవడం మంచిదీ.
విరిగిన ఎముకలకు - గోధుమ భస్మం -
విరిగిన ఎముకలకు - గోధుమ భస్మం -
గోధుమలను మట్టి మూకుడు లో వేసి పొయ్యిమీద పెట్టి నల్లగా మాడ్చి మెత్తగా నూరి జల్లించి నిలువ చేసుకోవాలి. రోజూ రెండు పూటలా పూటకు 10 gm మోతాదుగా 1 స్పూన్ తేనె కలిపి తింటుంటే అతి త్వరగా ఎముకలు అతుక్కుంటాయి.
కడుపు నొప్పి , పులి త్రేన్పులు తగ్గడానికి -
గోధుమ పిండి - 1/4 kg
వంట ఆముదం - 25 gm
పై వాటిని కలిపి బాగా పిసికి నిప్పుల పైన రొట్టె చేయాలి. రోజూ రెండు మూడు రొట్టెలు నెయ్యి, పంచదార కలుపుకొని నాలుగైదు రోజులపాటు తింటుంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం ,పులి త్రేన్పులు తగ్గిపోతాయి

మొండి ఉబ్బస రోగం తగ్గడానికి -
గోధుమలు - 50 gm
పసుపు కొమ్ములు - 50 gm
పై రెండింటిని ఒక మట్టి మూకుడులో వేసి చిన్న మంటపైన దూరగా వేయించి దంచి మెత్తగా పొడిచేసి జల్లించి ఒక సీసాలో నిలువ చేసుకోవాలి.
గోధుమలు - 50 gm
పసుపు కొమ్ములు - 50 gm
పై రెండింటిని ఒక మట్టి మూకుడులో వేసి చిన్న మంటపైన దూరగా వేయించి దంచి మెత్తగా పొడిచేసి జల్లించి ఒక సీసాలో నిలువ చేసుకోవాలి.
రోజు రెండు పూటలా మూడు గ్రాముల మోతాదుగా చప్పరించి తిని కొంచెం గోరువెచ్చని నీరు అనుపానంగా తాగుతుంటే అతి త్వరగా అన్ని రకాల దగ్గులు, ఘోరమైన ఉబ్బసం తగ్గిపోతాయి.
కాలిన పుండ్లు , బొబ్బలు తగ్గడానికి -
కాలిన పుండ్లు , బొబ్బలు తగ్గడానికి -
మెత్తగా ఉన్న గోధుమపిండిని కొంచెం నీటితో కలిపి లేపనం చేస్తుంటే కాలిన పుండ్లు ,బొబ్బలు త్వరగా తగ్గిపోతాయి.
బలహీనులు బలంగా కావడానికి -
గోధుమలు
సీమ బాదం పప్పు
నల్ల తుమ్మ బంక
పటిక బెల్లం
పై వాటిని సమాన భాగాలుగా కలిపి దంచి10 గ్రాముల పరిమాణంగా లడ్డూలు చేసి నిలువ ఉంచుకోవాలి.
బలహీనులు బలంగా కావడానికి -
గోధుమలు
సీమ బాదం పప్పు
నల్ల తుమ్మ బంక
పటిక బెల్లం
పై వాటిని సమాన భాగాలుగా కలిపి దంచి10 గ్రాముల పరిమాణంగా లడ్డూలు చేసి నిలువ ఉంచుకోవాలి.
రోజు రెండు పూటలా పూటకు ఒక లడ్డు తిని అనుపానంగా ఒక గ్లాస్ ఆవు పాలు తాగుతుంటే సన్నగా అస్తిపంజరం లాగా కృషించిపోయిన వారు తిరిగి బలిస్టులవుతారు.
అతి బహిష్టు ఆగిపోవుటకు -
ఎర్ర గోధుమలు - 1 భాగం
పటిక బెల్లం - 1 భాగం
ఎర్ర గోధుమ లను బాండీలో వేసి పొయ్యి మీద పెట్టి బొగ్గు లాగా నల్లగా మాడ్చాలి .తర్వాత వాటిని మెత్తగా నూరి జల్లించి దానితో సమానంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ చేసుకోవాలి.
దీనిని రెండు పూటలా పూటకు ఐదు గ్రాముల మోతాదుగా మంచినీటితో కలిపి తాగుతుంటే అధిక రుతు రక్తం తక్షణమే ఆగిపోతుంది.
జలుబు , తుమ్ములు తగ్గడానికి -
నెయ్యిలోవేయించినగోధుమపిండినిజీర్ణశక్తికిఅనుగుణముగా తగు మోతాదుగా రెండు పూటలా తింటూ ఉంటే పై సమస్యలు తగ్గిపోతాయి.
రొమ్ము నొప్పి తగ్గడానికి -
గోధుమ పిండిని జిల్లేడు ఆకుల రసంతో మెత్తగా నూరి ఆ ముద్దను రొమ్ము పైన నొప్పి ఉన్నచోట పట్టువేస్తుంటే రొమ్ము నొప్పి త్వరగా తగ్గిపోతుంది.
మలబద్ధకం తగ్గుటకు -
పొట్టు తీయని గోధుమలను పిండిగా చేసుకుని ఆ పిండితో రొట్టెలు కాల్చుకొని తింటూ ఉంటే సహజమైన మలబద్ధకం తగ్గిపోతుంది.
పొట్టు తీయని గోధుమలను పిండిగా చేసుకుని ఆ పిండితో రొట్టెలు కాల్చుకొని తింటూ ఉంటే సహజమైన మలబద్ధకం తగ్గిపోతుంది.