సూపులూ,బ్రెడ్ ల పైన చల్లుకునే నల్లటి కళోంజి గింజలు తెలుసు కదా.. ఇది వంటకాలకి రుచి తీసుకురావడమే కాకుండా రక్తంలోని చెడు కొవ్వుని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తాయట .నల్ల జీలకర్ర లేదా నైజల్లా అని కూడా పిలిచే ఈ గింజలని రోజువారి ఆహారంలో సుమారుగా ఒక ఐదు గ్రాముల వరకు తీసుకుంటే ఎనిమిది నుంచి పది వారాలలోపే రక్తంలోని చెడు కొవ్వు తగ్గుముఖం పడుతుందని అంటున్నారు జపాన్లోని ఒసాకా మెట్రోపాలిటన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పరిశోధనలో భాగంగా కొంతమంది ఉబకాయులకు నల్ల జీలకర్ర గింజల్ని ఆహారంలో భాగం చేశారు. 8 వారాల్లోనే ఆ వ్యక్తుల్లో ట్రై గ్లిజరయిడ్లు, అంతర్గత వాపులు తగ్గడంతో పాటు బరువు కూడా నియంత్రణలోకి రావడం గమనించారు. ఈ గింజల్లోని థైమేక్వైనోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ కి శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేసే శక్తి ఉందని ఈ పరిశోధనలో తేలింది. అయితే జీవనశైలి మార్పులు, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వైద్య సలహాలు తోడైనప్పుడే వారిలో ఈ ఫలితాలు పూర్తిగా లభిస్తాయని సారాంశం.
AN EXCELLENT COLLECTION OF AYURVEDIC RECIPES OF EMINENT INDIAN AYURVEDIC PRACTITIONERS LIKE BABA RAMDEV , ELCHURI , CHIRUMAMILLA MURALIMANOHAR ,PEDDI RAMADEVI ETC FOR VARIOUS HEALTH PROBLEMS.EXPLAINED IN TELUGU .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Featured post
గుండె రోగులకు.. నారాయణ హృదయాలయ సలహాలు
రోగుల సందేహాలు నారాయణ హృదయాలయ జవాబు డాక్టర్ దేవి శెట్టి గారు పది రూపాయలకే గుండె జబ్బులకు చికిత్సను అందిస్తూ విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం...
-
తెలుగు - తుమ్మ చెట్టు english - indian gum arabic tree హిందీ - బాబుల్ సంస్కృతం లో- బార్బరా మిత్రులారా తుమ్మ చెట్టుతో తయారుచేసిన నాగళ్...
-
మనం తినే ఆహార పదార్థాలలో మహా ఔషధ శక్తులు నుండి ఉన్న ముల్లంగి కూర కూడా ఒకటి. ఈ ముల్లంగి తల నుండి పాదాల వరకు వచ్చే సమస్త రోగాలను సర్వనాశనం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి